![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ సీజన్-9 లో టాస్క్ ల పరంపర సాగుతోంది. పాయింట్స్ కోసం కంటెస్టెంట్స్ కాళ్ళు చేతులు విరగ్గొట్టుకుంటున్నారు. ఇంతకీ ఈ పాయింట్స్ ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ రాబోతున్నారు.. ఈ టాస్క్ లలో చివర్లో ఉన్న ఇద్దరు ఎలిమినేషన్ అవుతారు. అందుకే లీస్ట్ లో ఉండకుండా టాస్క్ లలో గట్టి పోటీ ఇస్తున్నారు.
నిన్నటి టాస్క్ లలో తనూజ-కళ్యాణ్ టీమ్ లీస్ట్(చివరి) స్థానంలోకి వెళ్ళింది. అయితే దీనికి కారణం పవన్ కళ్యాణ్ సరిగ్గా బ్రెయిన్ వాడకపోవడమే.. ఇది నిన్నటి ఎపిసోడ్ చూసిన ప్రతీఒక్కరికి అర్థమవుతుంది. నిన్నటి టాస్క్.. 'హోల్డ్ ఇట్ లాంగ్'. ఏ జంట అయితే టాస్క్ ముగిసేవరకూ తమ ప్లాట్‌ఫామ్‌ను నేలకి టచ్ కాకుండా గాల్లో ఉంచగలుగుతారో వారు ఈ టాస్క్ విజేతలు అవుతారంటూ బిగ్‌బాస్ చెప్పాడు. ఈ టాస్కుకి ఇమ్మాన్యుయల్, రాము రాథోడ్ సంచాలకులుగా ఉన్నారు. ఇక బజర్ మోగిన తర్వాత టాస్క్ మొదలైంది. అన్ని జంటలకి ఒక్కో సంచి వేయండని బిగ్‌బాస్ చెప్పాడు. తర్వాత కేవలం ఒక జంటకి ఒక సంచి వేయండి అని బిగ్‌బాస్ చెప్పగానే మేము ఇద్దరం డిసైడ్ అయి పెడుతున్నాం ప్లీజ్.. అంటూ భరణి-దివ్యలపై భారం వేశారు ఇమ్మూ-రాము.
తర్వాత సంజన-ఫ్లోరా టీమ్‌కి కూడా సంచి వేయడంతో ఇక్కడ అబ్బాయిలు కూడా లేరు చాలా కష్టపడుతున్నాం ప్లీజ్ అంటూ సంజన బతిమాలింది. ఒక జంటకి రెండు సంచులు అని బిగ్‌బాస్ చెప్పాడు. శ్రీజ-సుమన్ శెట్టి టీమ్‌కి సంచి వేస్తుండగా ఒక నిమిషం ఆగు అని శ్రీజ చెప్పింది. కాదు మీ పొజిషన్ అలా పెట్టుకున్నారు మీరు అంటూ రాము అన్నాడు. ఆ వెంటనే సుమన్ టీమ్ టాస్క్ నుండి బయటకొచ్చేసింది. నెక్స్ట్ భరణి-దివ్య టీమ్ ఔట్ కాగా తర్వాత సంజన-ఫ్లోరా టీమ్ ఎలిమినేట్ అయింది. చివరిగా కళ్యాణ్-తనూజ, రీతూ-డీమాన్ టీమ్ మాత్రమే ఉన్నాయి. తనూజ టీమ్‌కి బ్యాగ్ పెడతాడు రాము. ఆ తర్వాత తనూజ తన తాడుని మెళ్లిగా కిందకి అంటానని కళ్యాణ్ తో చెప్పింది కానీ అతను మాత్రం బ్యాలెన్స్ చేయకుండా తాడుని అలానే పట్టుకున్నాడు దాంతో సంచి కిందపడిపోయింది. ఆగు ఆగు హే పడుతుందంటూ తనూజ ఆ రోప్‌ని వదిలేసి కళ్యాణ్‌పై ఫైర్ అయింది. నాకు చెప్పడానికి రాకు కళ్యాణ్ నువ్వు.. నీది డౌన్ వచ్చింది అక్కడ.. అని తనూజ చెప్పింది. నేను దించట్లేదు నువ్వు ఫుల్ డౌన్ చేసేశావ్ అక్కడ అంటూ కళ్యాణ్ అన్నాడు. ఇలా ఈ టాస్కులో డీమాన్-రీతూ గెలిచారు.
![]() |
![]() |